junior NTR

జూనియర్ ఎన్టీయార్ నుచూస్తే జాలేస్తుంది

అడుగడుగునా ఆయన తన పాతివ్రత్యం నిరూపించుకోవాలి

లేకపోతే ఈ కాకులు మీద పడి చీరుతాయి

కనీసం మానవత్వం చూపవు

ఎవరో చేతగాని తనం గుర్తుకొచ్చి

ఎన్టీయార్తో సమానం చేయాలన్న

తాపత్రయంతో హిస్టీరియా వచ్చిన వారిలా రెచ్చిపోతారు

ఏడు సముద్రాలు దాటి మర్రిచెట్టులో దాక్కున్నా

వదలకుండా లాక్కొచ్చి చిమ్ముతున్న విద్వేషం, చేస్తున్న దాడి చూస్తుంటే ఒక సమూహం సామూహికంగా ఒక మనిషిపై ఎంత విషం దాచుకుందో అర్థమవుతుంది.

స్పందించకపోతే స్పందించలేదు అని ఒక లొల్లి. పోనీ స్పందిస్తే నచ్చినట్టుగా స్పందించలేదు అని ఇంకొక లొల్లి;

ఆయనేమి ఎవరికీ బానిస కాదు మీరు చెప్పినట్లు స్పందించటానికి, ఆయనకంటూ కొన్ని అభిప్రాయాలుంటాయి కొన్నిటి మీద , ఆలా స్పందిస్తారు.

జూనియర్ మాట్లాడిన ప్రతి మాటకి, ప్రతి చర్య కు negative గా మాట్లాడే ఈ టీడీపీ మీడియాకు,కొంత మంది టీడీపీ వారికర్ధము కానిది ఏమిటంటే ప్రస్తుత పరిస్థితి లో టీడీపీ కి జూనియర్ కావాలి ఏమో కానీ జూనియర్ కి టీడీపీ అవసరము లేదు,అయన రాజకీయాల్లోకి రావాలి అనుకున్న రోజున బోలెడన్ని ఆప్షన్ లుంటాయి

Leave a comment