మేము మా 9 యేళ్ళ వైవాహిక జీవితము

Saradhi1సరిగా 9 ఏళ్ళకితం ఈ రోజు (26/05/2004) నా భార్య, నా ఇల్లాలు, నా గృహలక్ష్మి, నా బహిః ప్రాణం నా జీవితంలో ప్రవేశించింది, నేనామెలో ఇమిడిపోయా. ఆమె చేసే పనులు, నేను చేసే పనులు, ప్రతిస్పందనలు వీటిద్వారా, వయసు ఆకర్షణ స్థాయి నుంచి ఆరాధన స్థాయికి ఎదిగాము. కష్టాలు, సుఖాలు కలసి పంచుకున్నాం. కష్టాలు జీవితం లో భాగమనే అనుకున్నాం. కష్టాలలో ముఖ్యమైనది, పెళ్లి అయ్యే సమయానికి ఆర్ధికముగా ఇంకా నిలదొక్కుకోకపోవతము,, సుఖాలలో ఇద్దరు సంతానం కలగటం, వారందరినీ అమ్మ , నాన్న దగ్గర వుంది చూడకలగటం, వారి చేతుల్లో పెరిగి పెద్ద వారు అవుతూ చిన్ని చిన్ని ముద్దు మాటలతో పెంచుకోవతము చాలా పెద్ద సంతోషం . ఎప్పుడు మొదలయిందో చెప్పలేము కాని, కష్టాలలో, ఆరాధన నుంచి ప్రేమ మొదలయి, ఒకరిని ఒకరు విడిచి ఉండలేని స్థితికి చేరుకున్నాం, ఇది వయసు ఆకర్షణ, ఆరాధన అంతా కంటే కాదు, ప్రేమ.

జీవితము తీపి, చేదులతో కూడినది అన్నట్లు, అభిప్రాయ భేధాలు వచ్చినప్పుడు చాలా సీరియస్ గా దెబ్బలాడుకునే వాళ్ళం,దెబ్బలాడుకుంటున్నాం, ఈ దెబ్బలాట పక్క వారికి కూడా తెలియదు, అదొక విచిత్రం, తెలియనిచ్చేవాళ్ళం కాదు, కోపం వస్తే మనసు మూసుకుంటే, మనసుతో మాటాడకపోతే… చాలా కష్టం,కాదు బాధ. దీర్ఘకోపం పనికిరాదు కదా, అందుకే మళ్ళీ కారణం వెతుక్కుంటాం, మాట్లాడుకోడానికి, మళ్ళీ కలిసిపోతాం. ఈ మనసుతో కలయిక, విడిపోడం అనుభవించాలి తప్పించి మాటతో చెప్పడం కష్టం నాకు కోపము వచ్చి ప్రదర్శించిన తాను మనస్సులో దాచుకుంటుంది కానీ బయటకు రాదు, వచ్చినా మా అమ్మ, నాన్న  లకు తెలిసినప్పుడు తప్పు ఎవరిది అయినా కోడలు అయిన తనను మనస్సులో దాచుకొని , ఆడపిల్ల ఇంట్లో కస్ట పడితే   , కంట తడి పెడితే మంచిది కాదు అని కొడుకును అయిన నన్నే అరుస్తారు; ఒకొక్క సారి ఏమిటి కొడుకుని అయిన నన్ను వెనక వేసుకొకుండా  నన్ను అంటారు అను అనిపించినా తాను అంతలా మా జీవితాలలో ఇమిడి పోయింది మరి అని గర్వము.  ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన జీవితములో ప్రవేశించిన మనిషి మన కుటుంబములో అంతగా ఇమిడి పోయినప్పుడు ఇక జీవితములో కావలసింది అదే కదా?

వివాహ బంధం రెండు జీవితాలను పెనవేసే జీవితానుబంధం ఆలుమగల ఒక తియ్యని అనుబంధం మమతానురాగాలతో నిండిన ఇరు జీవితాల స్నేహబంధం. నా జీవితంలో   ఇంతవరకు పాలుపంచుకుని జీవితాన్ని సుఖమయం చేసిన నా జీవిత సహచరికి పెళ్లి రోజు శుభాకాంక్షలుSaradhi2

 

 

 

 

 

IMAG0198